Wednesday, 4 November 2026

యూఎస్బీసీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయండి

జనంసాక్షి, మంథని : యూఎస్బీసీ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో శనివారం జరిగే ధర్నాను విజయవంతం చేయలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు చింతకుంట్ల పోచయ్య శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. యు ఎస్ పి సి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సాధించుటలో భాగంగా రెండవ దశ ఉద్యమం కార్యక్రమము నేడు పెద్దపల్లి కలెక్టర్ కాంప్లెక్స్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులు పాల్గొనాలని యు.ఎస్.పి.సి స్టీరింగ్ కమిటీ నాయకులు శ్యామ్ , నారమళ్ళ లక్ష్మణ్ ఆరు సదయ్య, వి స్వామి, ఎస్ కనకయ్యలు విజ్ఞప్తి చేశారు