దిల్సుఖ్నగర్ అన్నిబిసెంట్ ఉమెన్స్ కళాశాల ప్రెషర్స్ డే వేడుకలు
ఎల్బీ నగర్( జనం సాక్షి ) . సెప్టెంబర్ 22.
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని చింతలకుంట పల్లవి గార్డెన్స్ లో అన్నిబి సెంట్ మహిళా కళాశాల డే వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు కె.వి ప్రదీప్ ముఖ్యదిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
మనిషి కి జీవితంలో వ్యక్తిత్వం చాలా ముఖ్యమైన అంశం అని సినీ నటుడు, దర్శకుడు కె. వి. ప్రదీప్ అన్నారు. కళాశాల కార్యదర్శి డాక్టర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మా కళాశాల ఇప్పటివరకు 25 బాచేస్ డిగ్రీ పూర్తి చేసి దేశ విదేశాలలో కంప్యూట ర్,సైన్స్, ఖగోళ, భౌతిక, శాస్త్రాలలో వివిధ రంగాలలో ఉన్నత స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రతీ ఆడపిల్లలు విద్యని అభ్య సించా లని మా కళాశాల లో ఉన్న అందరూ అధ్యాపకులు మంచి నిష్ణాతులైన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ వీణ వైస్ ప్రిన్సిపల్ స్నేహ కళాశాల విద్యార్థులు వివిధ నృత్యాలతో అలరించారు.




