మన్నపూర్ లో రైతు వేదిక ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 24 (జనం సాక్షి) మొగుడం పల్లి మండలంలోని మన్నపూర్ లో శనివారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రైతు వేదిక ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు అసలు ప్రజల గురించి ఎపుడైనా పంట్టించుకున్న దాఖలాలు లేవు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వం అన్నారు. రైతులు సమావేశం లు పెట్టుకోవడానికి రైతు వేదిక లు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే మాణిక్ రావు జడ్పీ చైర్మన్ మంజూ శ్రీ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,జడ్పీటీసీ అరుణ మోహన్ రెడ్డి,సిడిసి చైర్మన్ ఉమా కాంత్ పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ ఎంపీటీసీ కుతుబొద్దిన్, కిషన్ ఫవర్, రైతు సమన్వయ కో ఆర్డినేటర్ ప్రభు, శంకర్, గురు స్వామి, అశోక్ రెడ్డి, డి. శంకర్, జీవన్ రెడ్డి, విరన్న ఆశన్న ఆయా గ్రామాల్లో ని సర్పంచ్ ఎంపిటిసి లు తదితరులు పాల్గొన్నారు.