మన్మోహన్‌సింగ్ కలిసేందుకు బయలుదేరిన సీఎం
హైదరాబాద్: గ్యాస్ కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించిన అంశంపై మంత్రులు, ఎంపీల ప్రతినిథి బృందం సీఎం నేతృత్వంలో ప్రధానితో సమావేశం కానుంది. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు.