మన ఊరు- మనబడి పనులు పరిశీలించిన డిఈఓ

టేకులపల్లి ,సెప్టెంబర్ 27( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మనబడి పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మంగళవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మౌనిక సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను వెచ్చిస్తూ కార్పొరేటు స్థాయి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలో కూడా కల్పించాలని సదుద్దేశంతో నిర్వహిస్తున్న పనులను నాణ్యతను లోపించకుండా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ పేర్కొన్నారు. కిటికీలు, తలుపులు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాలని, జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి రామ్ సింగ్ ఠాకూర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మ ,విద్యా కమిటీ చైర్మన్ శంకర్రావు తదితరులున్నారు.