Thursday, 5 November 2026

మరణించిన విద్యార్థుల కుటుంబాలకు చేయూత

ఆర్థిక సాయం అందచేసిన ఎమ్మెల్యే

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): కూకట్‌పల్లిలో ఈ నెల 2వ తేదీన న్యూ సెంచరీ స్కూల్‌ గోడ కూలిన ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చనిపోయిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులకు 15 లక్షల రూపాయలు, గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చింది. ఈ మేరకు చెక్కులను కూకట్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. మరణించిన మణికీర్తన, చందనలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు, పాఠశాల యాజమాన్యం తరఫున 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్‌ పటేల్‌ (4) తదితరుల చికిత్స కోసం 45 లక్షలు ఖర్చు చేసినట్టు స్కూల్‌ యాజమాన్యం చెబుతోందని ఎమ్మెల్యే తెలిపారు.