Wednesday, 4 November 2026

మల్కాజిగిరి పార్లమెంట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాబిన్.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు29.
మల్కాజిగిరి పార్లమెంట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాబిన్ వినయ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య, గ్రేటర్ హైదరాబాద్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భూపేష్ సాగర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈసందర్భంగా రాబిన్ మాట్లాడుతూ.
బీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.నాపై నమ్మకం ఉంచి ఈపదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.