మల్లయ్య కుటుంబాన్ని ఆదుకున్న జడ్పీటీసీ
శివ్వంపేట సెప్టెంబర్ 22 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన బౌరంపేట మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5 వేల రూపాయల నగదు తో పాటుగా నిత్యవసర సరుకులను అందజేసి, బాధిత కుటుంబాన్ని తాను అన్ని విధాలు ఆదుకుంటానని జెడ్పిటిసి స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం కింద 2500 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగళ్ల లక్ష్మీనరసయ్య, వార్డు సభ్యులు పోచగౌడ్, వంజరి కొండల్, ముయ్యడి సింహం, పంబాల సంతోష్, కుంట రాజు, నాయకులు గౌరీ శంకర్, దొడ్లే అశోక్, ఖదీర్, ముద్దగల రాజు, కొత్తపేట శీను, కుంట లింగం, ప్రవీణ్, పోచయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.