మల్లికార్జునపల్లిలో వివి ప్యాడ్స్ పై అవేర్నెస్- ఎన్నికల విధానంపై అవగాహన కలిగి ఉండాలన్న సూపరింటెండెంట్

మునిపల్లి, ఆగష్టు 16, జనంసాక్షి : మండలంలోని మల్లికార్జునపల్లిలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నాడు సూపరింటెండెంట్ రామలింగం, కానిస్టేబుల్ పాండు ఆధ్వర్యంలో గ్రామస్తులకు వివి ప్యాడ్ లతో అవేర్నెస్ కల్పించారు. వివి ప్యాడ్ లకు సంబంధించి ఉన్న అనుమానలను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని, ఓటు వేసే విధానంపైన, వివి ప్యాడ్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీ, అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆశా వర్కర్ సంగీత, గ్రామస్తులు బుచ్చన్న, రాజా గౌడ్, మొగులయ్య, నాగేందర్, తుక్కారం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు