మషూకా సాంగ్‌లో రకుల్‌ అదుర్స్‌

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇంత బిజీలోనూ ఒక ప్యాన్‌ ఇండియా మ్యూజికల్‌ వీడియో చేసింది. ’మాషూకా’ అంటూ సాగే ఈ పాట హిందీ వెర్షన్‌ ఆల్రెడీ రిలీజయింది. తెలుగు, తమిళ వెర్షన్స్‌ని అల్లు అర్జున్‌ సోషల్‌ విూడియాలో లాంచ్‌ చేశాడు. రకుల్‌కి, టీమ్‌కి బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌ అందించిన ఈ పాటను తెలుగులో ఆదిత్య అయ్యంగార్‌, అసీస్‌ కౌర్‌ పాడారు. ’నీ నవ్వుకు పడిపోయా, నీ చూపుకు పడిపోయా, నా నిదరే చెడిపోయా.. నా నలువైపుల నీ మాయ, లోలోపల నీ మాయ, నీ ప్రేమలో దిగిపోయా’ అంటూ రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్‌ రాశారు. స్టైలిష్‌ లుక్‌తో తనదైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఇంప్రెస్‌ చేసింది రకుల్‌. ఆమె రీసెంట్‌గా అటాక్‌, రన్‌వే 34 చిత్రాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ప్రస్తుతం మిషన్‌ సిండ్రెల్లా, డాక్టర్‌ జి, థ్యాంక్‌ గాడ్‌, ఛత్రీవాలీ లాంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది. శివ కార్తికేయన్‌తో కలిసి చేసిన తమిళ మూవీ ’అయలాన్‌’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ బైలింగ్వల్‌ మూవీ ’31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌’
సెట్స్‌పై ఉంది.