ఫారెస్ట్ ఫ్లయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో కర్ర బొగ్గు వాహనం పట్టివేత.

అచ్చంపేట ఆర్ సి 30 జూలై (జనం సాక్షి న్యూస్) : అక్రమంగా తరలిస్తున్న కర్ర బొగ్గు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. గత గురువారం రాత్రి తెలకపల్లి సమీపంలో కర్ర బొగ్గు తో వెళ్తున్న వాహనాన్ని అటవీ సంరక్షణ ఫ్లయింగ్ స్కాడ్ ఫారెస్ట్  డివిజనల్ అధికారి డిసిఎం వాహనాన్ని అదుపులోకి తీసుకొని అచ్చంపేట అటవీ కార్యాలయం కు తరలించారు.ఈ ఘటన పై వివరాలు కోరగా సంబంధిత అధికారి శ్రీనివాస్  నుండి స్పందన కరువైంది. ఈ క్రమంలో ఫారెస్ట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ సెక్షన్ ఆఫీసర్ ధర్మ ప్రాథమిక వివరాలు వెల్లడించారు.