మహాత్మా గాంధీ చలనచిత్రం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు జిల్లాలోని పాఠశాలల విధ్యార్ధులకు మహాత్మా గాంధీ పై రూపొందించిన చిత్రాన్ని తిలకించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాపేట మండలంలోని వంశీ ధియేటర్ లో గాంధీ సినిమా ప్రారంభించి జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విధ్యార్ధులతో కలిసి సినిమా తిలకించారు. మంగళవారం మొదటి రోజు జిల్లాలోని 9 సినిమా ధియేటర్ లలో 3,586 మంది విధ్యార్ధులు సినిమా చూసిన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా సినిమా ప్రదర్శన జరిగిన్నట్లు తెలిపారు. పాఠశాల నుండి విధ్యార్ధులను సినిమా ధియేటర్ కు తీసుకొచ్చి తిరిగి వారిని పాఠశాలకు చేర్చే విధంగా ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు బాద్యతలు అప్పగించిన్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాల విధ్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను సంబంధిత ఎం ఈ ఓ లు పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.

తాజావార్తలు