Wednesday, 4 November 2026

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన టీజేఎస్ నాయకులు

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 2
అల్వాల్ పట్టణ కేంద్రంలోని మేడ్చల్ జిల్లా టీజేఎస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగాఆయనచిత్రపటానికిపూలమాలవేసిఘనంగానివాళులర్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మచందర్రావు మాట్లాడుతూ నా జీవితమే నా సందేశం అని చాటిన మహానీయుడు గాంధీజీ అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించారు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అది. మహాత్మా గాంధీ అందించిన అహింస ఉద్యమం యావత్ ప్రపంచానికి పూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాంత విశ్వవిద్యాలయంలో ఓ పాఠ్యాంశంగా మారింది. గాంధీ జీవితం ఆయన నమ్మిన సిద్ధాంతాలు నడిపిన ఉద్యమాలు ఒక్కదానికొకటి ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్, నాయకులు జె రవి కుమార్, ప్రషా, విష్ణుమూర్తి, ప్రవీణ్ కుమార్, ప్రభునాథ్, తదితరులు పాల్గొన్నారు.