60 అడుగుల రావణాసురుని విగ్రహం తయారీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ వరుసు రంగ లీల మైదానంలో ఈనెల ఐదున నిర్వహించే దసరా ఉత్సవాలలో భాగంగా 60 అడుగుల రావణాసురుని విగ్రహాన్ని తయారు చేసినట్లు దసరా ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రతి సంవత్సరం రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తూ భారీ రావణాసురుని దహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడంతోపాటు మిరమిడ్లు వెలిపే బాణాసంచా వెలుగుల్లో సంబరాలు జరుపుతున్నట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై  తిలకించాలని కోరింది.