మహాత్మా గాంధీ దిశలో శాంతి, అహింస మార్గంలో నడుచుకోవాలి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక
మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్ 2(జనంసాక్షి)
జాతిపిత పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ సేవలను స్మరిస్తూ అహింస, శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్రానికి పోరాడిన గొప్ప మహనీయులని, నేటి యువత వారి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.