మహాదేవపూర్ మండల కేంద్రంలో 6వ తేదీన దివ్యాంగుల శిబిరం

మహదేవపూర్ సెప్టెంబర్ 4 (జనంసాక్షి)

మహదేవపూర్ మండల కేంద్రంలో మంగళ వారం రోజున దివ్యాంగుల శిబిరం నిర్వహిస్తామని, అర్హులైన దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..
మహాదేవపూర్ మండల పరిషత్ కాంప్లెక్స్ లో నిర్వహించే దివ్యాంగుల శిబిరంలో మహాదేవపూర్, కాటారం, పలిమెల, మలహర్, మహాముతారం మండలాలకు చెందిన వారు పాల్గొని కృత్రిమ అవయవాలు పొందాలని ఎంపీపీ రాణీ బాయి రామారావు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలీం అండ్ కో.సహకారంతో డివ్యాంగులకు వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, చేతులు, ట్రై సైకిల్ లు, విల్ చైర్ లు అందజేస్తారనీ, సదరం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు వెంట తీసుకురావాలని ఎంపీపీ రాణీ బాయి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.