మహాసభలు జయప్రదం చేయండి…
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
బెల్లంకొండ వెంకటేశ్వర్లు….
అనంతగిరి, జనం సాక్షి
సెప్టెంబర్ 29న ఆత్మకూరు మండలం నమ్మికల్ గ్రామంలో జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయాలని గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు. మండల పరిధిలోని త్రిపురవరం గ్రామంలో గురువారం అనంతగిరి మండల కల్లుగీత కార్మిక సంఘం నాయకులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాల నుండి కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కల్లు అమ్ముకుంటూ జీవనాధారం కొనసాగించే గీత కార్మికుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయుట, ఎక్స్గ్రేషియా పెంపు, ప్రభుత్వ సభ్యత్వ గుర్తింపు కార్డులు ,వృత్తి పన్ను రద్దు చేయుట తో పాటు సర్దార్ పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని వంటి అనేక డిమాండ్లతో పోరాటం కొనసాగిస్తున్నామని, ఈ పోరాటంలో ప్రతి గీత కార్మికుడు పాల్గొనాలని ఆయన కోరారు. 29న జరిగే మహాసభలకు రాష్ట్ర నాయకులు వస్తున్నందున వారు మరిన్ని కార్మిక సంఘం గురించి విషయాలు తెలియజేస్తారని, మన హక్కులను ఏ విధంగా సాధించుకోవాలో రాష్ట్ర నాయకుల అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరు రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో…. నాయకులు మట్టపల్లి సైదులు, బెల్లంకొండ నాగేంద్ర ధన మూర్తి, మట్టపల్లి నారాయణ ,సురభి గురవయ్య, జెర్రిపోతుల నాగేశ్వరరావు, మట్టపల్లి రామకోటయ్య,మామిడి వెంకటేశ్వర్లు, ఉయ్యాల కాశయ్య,మట్టపల్లి వెంకటయ్య, మట్టపల్లి సిద్దయ్య ,గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area