బస్ స్టేషన్ ను పునరుద్ధరించాలి
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రయాణ ప్రాంగణాన్ని శుభ్ర పరిచి పునరుద్ధరించాలని కోరుతూ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి భావన ఆదినారాయణ గురువారం తహశీల్దార్ దామోదర్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్ లను ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ కాలనీ వాసులకు పట్టాల పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలను నిలిపి వేసి నిరుపేదలకు ఆ భూములను పంపిణీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది అంశాలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.