ఎల్బీనగర్ (జనం సాక్షి ) సమాజానికి పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా రంగురంగుల హరివిల్లు లతో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయం మహిళలతో సందడి నెలకొంది .ఆలయ ఆవరణలో ఇవో అన్నపూర్ణ ఆధ్వర్యలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలను ప్రోత్సహించాలని ప్రోత్సహించడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మహిళల్లో దాగి వున్న ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పలు రకాల ముగ్గులను సాంప్రదాయ బద్ధంగా వేసి అందర్నీ ఆకట్టుకున్నారు .ముగ్గుల్లో పలు సందేశాలు తెలియచేస్తూ అందమైన ముగ్గులు వేశారు ఈ సందర్భంగా ప్రసాద్‌శర్మ హైమావతి దంపతుల సహకారంతో గెలుపొందిన మహిళలకు
బహుమతులను అందజేశారు .మొదటి బహుమతి ఐదువేల రూపాయల పట్టుచీరను సువర్ణ గెలుచుకోగా రెండో బహుమతిని మూడు వేల రూపాయల విలువగల పట్టు పట్టుచీరనుభాగ్యలక్ష్మి ‘ మూడవ బహుమతి రెండు వేల పట్టుచీర వరలక్ష్మి గెలుచుకున్నారు . ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దుర్గారెడ్డి ఈశ్వరయ్యగౌడ్ ఇందిరా దాత అశోక్ గాంధీ అధికారులు రాంబాబు శ్రీనివాస్ వెంకటయ్య సంతోష్ భక్తులు మధు సాగర్ శివలింగప్ప రమాదేవి శ్రీ సాయి శాంతి స్వాహా యా సేవా సమితి చైర్మన్ ఎర్రం పూర్ణ శాంతి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ నీల విజయలక్ష్మి . జ్వాలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .




