Tuesday, 3 November 2026

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్

ఎల్బినగర్ (జనం సాక్షి ) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్ అన్నారు
స్వచ్ఛ్-సర్వేక్షన్ 2019  హస్తినాపురం డివిజన్ పద్మావతి నగర్ కాలనీ యూవ బార్ రోడ్డులో డివిజన్ కార్పొరేటర్  రమావత్   పద్మా శ్రీను నాయక్ ఆధ్వర్యములో ముగ్గులు వేసి బహిరంగ మూత్రవిసర్జన చేయరాదు అంటూ ప్రతిఒక్కరు స్వచ్ఛత పాటించి స్వచ్చ కానీలుగా మారేలా చెర్యలు తీసుకోవాలి అని  అన్నారు .అలాగే ఈ బారు ప్రక్కనే కాలనీ కి ప్రధాన దారి ఉండడం రాత్రి వేళల్లో మందుబాబులకు ఈ రోడ్డు అడ్డాలా మారింది అని దీనివలన కాలనీ వాసులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు రాత్రి వేళలో ఈ రోడ్డులో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు అని దీనిపై పోలీస్ ల పర్యవేక్షణ ఉండేలా తగు చెర్యలు తీసుకుంటాము అని ఈ సందర్భముగా తెలియజేసారు. ఈ కార్యక్రమములో పారిశ్యుధ్య అధికారులు గణేష్, శంకర్ జవాన్, భాస్కర్, హనుమంతు కాలనీ ప్రతినిధి ఏరియా సభ్యులు నాగేశ్వర్ రావు గారు పాల్గొన్నారు.