సోమవారం 7`3`2022
ఏటా మహిళా సదస్సుల..మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటున్నా మహిళా బిల్లుకు సంబంధించిన
చట్టం మాత్రం రూపుదదిద్దుకోవడం లేదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో అధికార విపక్ష సభ్యులు ఉమ్మడిగా విఫలం అయ్యారు. ఎనిమిదేళ్ల మోడీ కాలంలో దీని గురించ ఒక్కనాడైనరా మాట్లాడారాఅన్నది ఆలోచించాలి. బేటీపడావో.. బేటీ బచావో ఓ నినాదంగా మారింది. చట్టసభల్లో మహిళల కు రిజర్వేషన్లు లేవు. ఉద్యోగాలు లేవు. చదువుకునే మహిళలకు కనసీం ఫ్రీ చదువులు లేవు. విద్యా రుణాలు తీసుకుంటే కనీసం వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. మహిళలను గౌరవిస్తున్న మనదేశంలో మహిళల కోసం ఏం చేశారంటూ ఏవిూ లేదు. ఘనత వహించిన మోడీకి ఇవన్నీ తెలియనివి కాదు. జిఎస్టీ రాబుడులను ఎలా పెంచాలన్న ఆలోచన తప్ప ఇలాంటి విషయాల్లో చిత్తశుద్ది లేదు. ఆర్థిక మంత్రిగా ఓ మహిళ ఉన్నా మహిళలకు ఒనగూరుతున్న ప్రయోజనం లేదు. మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా బిల్లుపై చర్చించేవారు. అలాచేసివుంటే ఇప్పటికే బిల్లు పాస్ అయి ఉండేది. కనీసం వారి అభిప్రాయాలకు విలువను ఇచ్చినట్లుగా ఉండేది. కానీ అలా జరగలేదు. కేవలం వారికి శుభాకాంక్షలు చెప్పడంతో బడానేతలు తప్పించుకున్నారు. తమ ధర్మాన్ని విస్మరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇలా ఏటేటా జరుపుకుంటున్నా,,,మన నేతల్లో మార్పు రావడం లేదు. చట్టసభల్లో వారికి రావాల్సిన వాటాను కావాలనే అడ్డుకుంటున్నారు. సమాజంలో మహిళలకు ఉన్న అత్యుతన్నస్థాయి గౌరవాన్ని మనమే దిగజార్చుకుంటున్నా పెద్దగా భయపడడం లేదు. సమాజం కూడా వారిని ఇంకా విలాసవస్తువుగానే చూస్తున్నది.. అమ్మాయి కనిపిస్తే రేప్ చేయడమే లక్ష్యంగా మృగాళ్లు చెలరేగి పోతున్నారు. అందుకే చట్టసభల్లో వారికి గౌరవం ఇచ్చేలా రిజర్వేషన్ బిల్లును తేలేక పోయాం. ఈ పరిస్థితులపై మనమంతా మహిళల హక్కులపై చర్చించాలి. వారి గౌరవానికి భంగం కలిగించే అంశాలపై యుద్దం చేయాలి. అనేకానేక అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తిమంతమైన మహిళగా ఆమె నిరూపించుకుంటూనే ఉంది. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. మహిళా భ్యుదయమే దేశాభ్యుదయం అని మనమంతా కీర్తిస్తూ వారిని మభ్య పెడుతున్నామని గుర్తించాలి. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. ఇక దీనిని సవాల్‌గా తీసుకుని మహిళలే తమ హక్కుల కోసం పోరాడాలని గుర్తుంచుకోవాలి. పురుషాహంకార సమాజాన్ని నిలదీయాలి. నిగ్గదీయాలి. తమ హక్కులను సాధించే వరకు పోరాన్ని కొనసాగించాలి. ఇక కారణాలు చెప్పుకోవడానికి ఏవిూ లేదు. ఎవరి కారణంగా మహిళా బిల్లు ఆగిపోయిందనడానికి లేదు. మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ బలమున్నది. ఈ బడ్జెట్ సమేశాల్లో దీనిపై చర్చ చేయడం ద్వారా తన చిత్తవుద్దిని చాటుకోవాలి. అన్నింటికి మించి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ బేషరతుగా చర్చకు పూనుకోవాలి. ఈ మహిళా దినోత్సవ కానుకగా అయినా ప్రధాని మోడీ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చిత్తశుద్దితో బిల్లును గట్టెక్కించే బాధ్యతను తీసుకుంటే మహిళాలోకం హర్షిస్తుంది. గతంలో లాగా కారాణలు లేదా సాకులు చూపే సమయ మిది కాదు. అలా చేస్తే ఇక బిజెపిని పూర్తిగా నమ్మరు. ఎనిమిదేళ్లుగా దీనిపై మాటమాత్రంగా అయినా మాట్లాడ కుండా నెట్టుకొస్తున్న ప్రధాని మోడీ ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి పాస్
చేయించే బాధ్యత తీసుకోవడం ద్వారా భారతీయ మహిళలకు భరోసా కల్పించాలి. భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండున్నర దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేక పోతోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. అనేక సదస్సులు,సమావేశాల్లో ప్రధాని మోడీ మహిళల ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నా పార్లమెంటులో మాత్రం బిల్లు రావడం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మలివిడత లో అయినా ఈ అంశాన్ని చర్చిద్దామన్న భావన ప్రకటించాలి. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కుతున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కారణం గా ఎందరో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. కానీ అసెంబ్లీ , పార్లమెంటుల్లో మాత్రం రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు దక్కడం లేదు. ఇలా వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారు అవుతున్నారు. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉంది. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించి నప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడుతుంది. అలాగే చదువుకునే అమ్మాయిలకు ఉచిత విద్యా రుణాలు అందాలి. అలాగే వారి ఉన్నత విద్యాకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. బేటీపడావో ..బేటీ బచావో నినాదం కార్య రూపం దాల్చాలి.మహిళలను విలాసవస్తువుగా చూసే సంస్కృతిపై కఠినంగా వ్యవహరించాలి. అత్యాచా రాలు, వేధింపులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాలురావాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. మహిళ ల గొప్పతనాన్ని భారతీయ మహిళల ఆదర్శాలను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని ఈ సారయినా మహిళా బిల్లుకు మోక్షం కలిగించాలి. అలాగే మహిళల సంరోణకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకో వాలి. విద్యారంగంలో వారిని ముందుకు నడిపించేలా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి.




