Tuesday, 3 November 2026

షీటీమ్స్‌ రాకతో పెరిగిన భరోసా

మహిళల రక్షణలో ముందున్న పోలీసులు
ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా మన టీమ్స్‌
హైదరాబాద్‌,మార్చి7(జనం సాక్షి): తెలంగాణలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ ఏర్పాటు చేశాక మంచి ఫలితాలు వస్తున్నాయి. మహిళలకు అండగా బాగా పనిచేస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలతో చైతన్యం చేపట్టారు. ఇకపోతే షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినప్పుడు దీనిని బలోపేతం చేసి మహిళలకు అండగా నిలవడంలో స్వాతి లక్రా కృషి ప్రశంసనీయం. సిటీ పోలీస్‌ తరపున షీటీమ్స్‌ బాగా పనిచేయడంతో అనేక రాష్టాల్ల్రో దీనిని విస్తరించారు. ఇదో రకంగా తెలంగాణ షీ టీమ్స్‌కు దక్కిన గౌరవంగా చూడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. షీటీమ్స్‌ ఏర్పడి ఏడేళ్లు పూర్తవుతున్నందున వారి పాత్రను,కృషిని అభినందించాల్సిందే. ఎన్నో క్లిష్లమైన సమస్యలను, కేసులను పరిష్కరించడంతో పాటు..మహిళలకు తామున్నామన్న భరోసా ఇవ్వడంలో షీ టీమ్స్‌ విజయం సాధించాయి. డయల్‌ 100, మహిళా భద్రత, షీ టీమ్స్‌ గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. ఉమెన్‌ సేప్టీ విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. మహిళలను వేదించిన లేదా రేప్‌ కేసుల్లో నిందితులకు శిక్ష
ఖరారు చేయించడంలో షీటీమ్స్‌ కీలక భూమిక పోషించాయి. యువతులు, మహిళలు ఇక నగరంలో నిర్భయంగా ఉండొచ్చన్న భరోసా దక్కడంలో ఈ టీమ్స్‌ బాగ కృషి చేస్తున్నాయి. వారికి అండగా, రక్షణగా ’షి’ బృందాలను ఏర్పాటు చేసి వారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. స్వాతిలక్రా ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందాల్లో అందరూ మహిళా పోలీసులే ఉంటారు. ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరంతా సాధారణ డ్రెస్‌లోనే ఉంటారు. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, ఆటోస్టాండ్ల వద్ద, కళాశాలల వద్ద నిఘా వేస్తారు. మహిళలను వేధింపులకు గురి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుంటారు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 100కు ఫోన్‌ చేస్తే తక్షణ సాయం అందిస్తామని స్వాతిలక్రా మహిళలకు సూచించారు. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతూ షి బృందాలకు పట్టుబడిన వారు జాగ్రత్తగా ఉండకపోతే వారిపై కైమ్ర్‌షీట్‌ తెరుస్తారు. ఆ వివరాలు అన్ని పోలీస్‌స్టేషన్లలో అందుబాటులో ఉండేలా సెంట్రల్‌ డేటాలో పొందుపరుస్తారు. ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు. చట్ట ప్రకారం శిక్షించడమే కాకుండా, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేస్తారు. ఈవ్‌టీజర్లపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మొత్తంగా గతంతో పోలిస్తే షీ టీమ్స్‌ ఏర్పడ్డ తరవాత అనేక విజయాలు సాధించారు. అన్నింటికి మించి మహిళలకు భరోసా దక్కింది. అందుకే ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటున్నాయి తెలంగాణ షీ టీమ్స్‌. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్‌ పెట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి రక్షణ కోసం షీ టీమ్స్‌ని 2018లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఊపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేస్తోంది ఈ మహిళ రక్షణ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 331 టీమ్స్‌ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్‌ స్టార్ట్‌ అయిన కొత్తలో దాదాపు 5వేలకు పైగా కేసులు వచ్చేవి..కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతంలో మైనర్లు కైమ్ర్‌లో ఇన్వాల్వ్‌ అయ్యేవారు. షీ టీమ్స్‌ ఇలాంటి కేసుల్లో పేరెంట్స్‌కి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చిందే తడవు… ఆకతాయిలు, పోకిరీలను అరెస్ట్‌ చేసింది షీ టీమ్స్‌ వ్యవస్థ. ఇందులో ఎక్కువగా 25 సంవత్సరాల వయస్సున్న యువకులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తెలంగాణ విమెన్స్‌ సేప్టీ వింగ్‌ అడిషనల్‌ డిజిపి స్వాతి లక్రా చెబుతున్నారు. ఎవరైనా వేధిస్తే గతంలో పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడానికి మహిళలు ముందుకొచ్చే వాళ్లు కాదని,కాని ఆన్‌లైన్‌లో, వెబ్‌ సైట్‌ ద్వారా అవగాహన కల్పించడంతో ఫిర్యాదులు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సైబర్‌ కైమ్ర్‌ ఫ్రాడ్‌ సోషల్‌ విూడియా వేదికగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమస్య వస్తే వెంటనే మా వాట్సాప్‌ నెంబర్‌ కి మెసేజ్‌ చేయండి… ఇప్పుడు మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.