మహిళ ఆత్మహత్య

నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలకేంద్రంలో గల గోసంగి కాలనికి చెందిన గృహిణి సంపంగి లావణ్య (25) తన ఇంటో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. అయితే మంటలు తాళలేక ఆమె కేకలు పెట్టింది. వెంటనే స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ లావణ్య తుది శ్వాస విడిచింది. ఆమెకు భర్త సాయిలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడానికి గల కారణాలు తెలియరాలేదు. ఎస్‌ఐ చందర్‌ రాథోడ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.