విఆర్‌ఎపై రైతుల దాడి
ఏలూరు,అక్టోబర్ 28(జనంసాక్షి): గ్రామ రెవెన్యూ అధికారిపై రైతులు దాడి చేసిన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పెదపాడు మండలం వీరమ్మకుంట గ్రామంలోగల చేపల చెరువులో వీఆర్వో కోటేశ్వరరావు వీఆర్‌ఏ దావీదు తనిఖీకి వెళ్లారు. అయితే… వీరిపై రైతులు దాడికి పాల్పడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.