మహేశ్‌ త్రివిక్రమ్‌ సినిమాలో లేను

బీమ్లా నాయక్‌ బ్యూటీ సంయుక్తా విూనన్‌
భీమ్లా నాయక్‌’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ సంయుక్త విూనన్‌. ఈ చిత్రంలో రానా సరసన నటించిన ఆమెకు నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు ఆఫర్స్‌ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలోనే బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆగష్టు 5న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె విూడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సంయుక్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో హీరో ధనుష్‌తో గొడవలంటూ వచ్చిన పుకార్లపై స్పందించింది. కాగా సంయుక్త, ధనుష్‌ సరసన సార్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ధనుష్‌ స్టయ్రిట్‌ తెలుగు చిత్రమిది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో తనకు, ధనుష్‌కు గొడవ జరిగిందని, దీంతో మధ్యలోనే ఆమె మూవీ సెట్‌ నుంచి వెళ్లిపోయినట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమెను దీనిపై ఓ విలేకరి ప్రశ్నించగా.. సంయుక్త ఆసక్తిగా స్పందించింది. ’ధనుష్‌తో నాకు గొడవలా! నిజంగానే అలాంటి వార్తలు వచ్చాయా? నాకు తెలియదు. అలాంటి వార్తలు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి’ అంటూ ధనుష్‌తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. అంతేగాక మహేశ్‌`త్రివిక్రమ్‌లో చిత్రంలో తను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ధనుష్‌ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైనమెంట్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ కోసం తను 21 రోజుల కాల్షీట్‌ను కెటాయించానని, ఓ పాట విూనహా తనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఈ సందర్భంగా సంయుక్త విూనన్‌ తెలిపింది. త్వరలోనే ఈ పాట షూటింగ్‌లో పాల్గొననున్నట్లు ఆమె వెల్లడిరచింది.