జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ గురువారంఅందోలు నియోజకవర్గం లోని ఆయా మండలాల కమిటీలను ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని మాజీ మంత్రి పి బాబు మోహన్ అన్నారు. గురువారం అందోలు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద అందోలు నియోజకవర్గం మండల పార్టీ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గం లోని చౌటకూర్ మండల శేరి రాంరెడ్డి గూడెం, బద్రి గూడెం గ్రామాలకు చెందిన సుమారు 25 మంది నాయకులు మాజీ మంత్రి బాబు మోహన్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.
అందోలు నియోజకవర్గం కన్వీనర్ గా పి. ఉదయ్ బాబు మోహన్, నియోజకవర్గ మీడియా కమిటీ ఇన్చార్జిగా నవీన్ కుమార్, జోగిపేట పట్టణ అధ్యక్షులుగా సయ్య సాయి, అందోల్, చౌటకూర్, పుల్కల్, మునిపల్లి, రాయి కోడ్, రేగోడు, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల అధ్యక్షులుగా శేఖర్ గౌడ్, కే. శేఖర్ గౌడ్, పండరి, సుమన్, సంతోష్, సతీష్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఆనంద్ శర్మ, రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్, జగన్నాథం, పార్టీ నాయకులు రమేష్, గోవర్ధన్, కరుణాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి, బిజెపి నేత పి బాబు మోహన్




