మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ని అరెస్టు చేయాలి

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి)
జహీరాబాద్ మహిళ కాంగ్రెస్ ఆద్వర్యంలో బుధవారం జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాల్కల్ మండలానికి చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ మాజీ మంత్రి వర్యులు మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని అన్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అద్యక్షురాలు జ్యోతి మోహన్, తాజా మాజీ కౌన్సిలర్ లు సుజాత, తాహెరాబెగం, కాంగ్రేస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు