ఎల్బీ నగర్ (జనం సాక్షి ) అక్కాతమ్ముళ్లు , అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రక్షాబంధన్ నిలుస్తుందని నిన్న జరిగిన డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు పేర్కొన్నారు . రాఖీ పండుగ పురస్కరించుకుని శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు , జిహెచ్ఎంసి మహిళా పారిశుద్ధ్య కార్మికులు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి రాఖీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనంద ఉత్సవాలను రాఖీ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు . వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపటం జరిగింది .అదేవిధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా వ డివిజన్లో ప్రతి కాలని లో ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని సూచించారు
–




