Wednesday, 4 November 2026

సికింద్రాబాద్ లో ఘనంగా రాఖీ పండు గా వేడుకలు

సికింద్రాబాద్ ( జనం సాక్షి ):  తెలుగు ఇంటి ఆడపడుచులకు   రాఖీ పండుగ అంటే   ఎంతో ఆనందం తో  వారి తోడ పుట్టిన అన్నదమ్ముల   ఆత్మీయతను పంచుకోవడానికి   ఒక్క రోజు ముందు   తన పుట్టింటికి వెళ్ళటానికి  ఆడపడుచులు    ఎంతో   ఉత్సాహంతో   వెళ్తారు .   సికింద్రాబాద్ లో   అన్న తమ్ముళ్లకు   రాఖీ కడుతూ  ఆడపడుచులు   ఎంతో సంతోషంగా    రాఖీ  వేడుకలను నిర్వహించుకున్నారు .    భాగ్యలక్ష్మి   సోదరి   నామాలగుండు  ఉప్పర్ బస్తి  లో ఉండే తన  అన్నయ్య   మున్నూరు  చందు  కు   15 సంవత్సరాల నుంచి    ఇక్కడికి వచ్చి    రాఖీ    కడుతున్నానని తెలిపారు . అదేవిధంగా ఈ సంవత్సరం   కూడ  మా అన్నయ్యకు రాఖీ కట్టడం   నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు .   మా  ఇంటి ఆడపడుచు   నాకు   రాఖీ కట్టి  మా  మంచి కోరుకునే   మా చెల్లెళ్ల కు    జీవితకాలం   తోడు నీడగా ఉంటామని     దీవించారు.