హైదరాబాద్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర
హైకోర్టు రద్దు చేసింది. ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అజారుద్దీన్‌పై 2001లో బీసీసీఐ నిషేదం
విధించింది. దాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్ సీటి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ,
కోర్టు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై అజారుద్దీన్ రాష్ట్ర
హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ అనంతరం అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల
నిషేధాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.




