Wednesday, 4 November 2026

మాజీ మంత్రి ఈటల తండ్రి దశదినకర్మలకు హాజరైన బూర్గంపహాడ్ బీసీ సంఘం.

– బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు ఆధ్వర్యంలో…

 

బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల, జిల్లా బిసి సంఘం నాయకులు హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ తండ్రి కీర్తిశేషులు ఈటల మల్లయ్య దశదినకర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహంకాళీ రామారావు, అశ్వాపురం మండల కార్యదర్శి దంతాలజగదీష్, ముదిరాజ్ నాయకులు రాధాకృష్ణ, తోట వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.