మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవేందర్ గౌడ్

ధారూర్ మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకుడు రాఘవేందర్ గౌడ్ తో పాటు యువకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని కండువాకప్పి మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు పార్టీలోకి ఆహ్వానించారు.
కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రఘుపతిరెడ్డి వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి నాయకులు బోయిని అంజయ్య యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అశోక్ లాల్ మహమ్మద్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు