మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం

మోత్కూరు సెప్టెంబర్ 11 జనంసాక్షి : మండలంలోని పాటిమట్ల గ్రామంలో మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ హాస్పిటల్ వారిచే నిర్వహించినటువంటి ఉచితంగా వైద్య శిబిరాన్ని చిరుమర్తి యాదయ్య ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మోత్కూరు మండల అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కురుమేటి విక్రమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరుమర్తి యాదయ్య మాట్లాడుతూ గ్రామంలో వర్షం కారణంగా విషపూరితమైన రోగాల వల్ల బారినపడ్డ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి లేవ లేనటువంటి వృద్ధులకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు చక్కటి అవకాశం గ్రామంలో ఉన్నవారు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ శ్రీనివాస్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కురుమేటి నవీన్,మహేష్,సోమయ్య, రాజు, సాయికిరణ్, సిద్దేశ్, గ్రామస్తులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.