నేను కేసీఆర్ సైనికుడిని

మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
మునుగోడు సెప్టెంబర్11(జనంసాక్షి):
నేను కేసీఆర్ సైనికునని మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్ అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో సమాచారం ఇవ్వకపోవడం నియోజకవర్గ బాధ్యుల విచక్షణకు వదిలేస్తున్నానని ఎవరు పిలిచినా పిలవకపోయినా కేసీఆర్ కోసం పని చేస్తా నేను కేసీఆర్ సైనికుడిని మునుగోడులో టిఆర్ఎస్ పార్టీబలంగా ఉన్నందున ఆశావాహులు పది మంది ఉన్నారు వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కచ్చితంగా పని చేస్తా కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తానని అన్నారు.
ఇక్కడ ఉన్న పెద్దలు పిలవడం లేదని నేను అలిగి ఇంట్లో ఉండనని టిఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
Attachments area