Wednesday, 4 November 2026

మానవుల్లో ఐక్యతను చాటుతున్న సహస్రాబ్ది

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ముచ్చింతలల్‌ఓ సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగగా సాగుతున్నాయి. సామాన్యులు సైతం అక్కడకు వెళ్లి మూర్తిని దర్శించుకోవాలన్న తపనను కనబరు స్తున్నారు. అలాగే రాజకీయ,ఆధ్యాత్మిక ప్రముఖులు కూడా రోజూ విచ్చేస్తున్నారు. ముచ్చింతల్కు వచ్చిన అయోధ్యకు చెందిన ఓ ధర్మాచార్యుడు ` భారతంలోని ఓ
అద్భుత సంఘటన గుర్తు చేశారు..ధర్మరాజుకి యక్షుడు ఓ ప్రశ్న సంధిస్తాడు… దిక్కుల్లో ఏది అత్యుత్తమమైంది? నువ్వు ఏ దిక్కులో వెళతావు? అని… ధర్మజుడు క్షణమైనా తడుముకోకుండా ` ఙ్ఞానస్వరూపుడైన ఆచార్యుడు చూపిందే అసలైన దిక్కు… నేను వెళ్లేది అదే దిక్కు అని ఠక్కున చెబుతాడు… ఇది చాలామంది వినే వుండొచ్చు.. కాని ఈ ఒక్క ముక్క జవాబులోనే జీవితాన్ని సార్ధకం, ఫలప్రదం చేసేంత శక్తి వుందన్న నిజం అంత సులభంగా తట్టదు…! అవును..జీవితాన్ని సఫలం చేసే సన్మార్గాన్ని చూపేదే అసలైన దిక్కు.. అట్లాంటి మార్గాన్ని చూపేందుకే ఇవాళ 216 అడుగుల ఎత్తులో జగదాచార్యులు రామానుజులు సుప్రతిష్ఠితులయ్యారు…! ప్రపంచానికే దిశా నిర్దేశర చేస్తూ…! ప్రధాని మొదలుకొని రోజూ వస్తున్న రాజకీయ ప్రముఖులదాకా అందరూ చెపుతున్నదొక్కటే… ఆచార్యుని నీడలో తమకో దివ్య ప్రేరణ అనుభూతికి వచ్చిందని… రాజకీయాల్లో తాము వెళ్లాల్సిన దిక్కేదో వారిచ్చిన స్ఫూర్తితోనే నిర్ణయించుకుంటానీ… అంటున్నారు. ఇవాళ ప్రపంచాన్ని ముఖ్యంగా యూత్‌ని అమితంగా ప్రభావితం చేస్తున్న స్పిరిట్యువల్‌ గురు రవిశంకరే ` జగతికి ఇవాళ రామానుజుల స్ఫూర్తే వెలుగుల బావుటా అని పారవశ్యంతో చెప్పారు… స్నానానికి వచ్చేప్పుడు బ్రాహ్మణ శిష్యుడి భుజాన్ని ఆసరా చేసుకొని నడిచే రామానుజులు స్నానం చేసి వెళ్లేప్పుడు నిమ్న కులస్తుడి భుజంపట్టుకొని నడిచి వెళ్లడం చూసి ఇదేం చోద్యమని అడిగారట కొందరు ఛాందసులు… బ్రాహ్మణుడి ఆసరాతో వచ్చి శారీరకంగా స్నానం చేశానేమో గాని… నేను పెద్దకులం వాణ్ణి అనే మనసు తాలూకు మాలిన్యాన్ని ఈతడి ఆసరా తీసుకోవడంతో కడిగేశాను అన్నారట రామానుజులు…! స్వయానా రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ చెప్పిన సంఘటన ఇది.. మానసిక శుద్ధత స్నానంతో కాక సాటి మనుషులకు అత్యంత దగ్గరైతేనే వస్తుందన్న ఆచార్యుల సమతా సందేశం బహుశా అందరినీ కదిలించి ఉంటుంది. రాజ్‌ నాథ్‌ సింగ్‌… మాత్రమే కాదు ఎందరెందరో తలపండిన, కాకలుతీరిన రాజకీయ పెద్దల ఆలోచనల్లో ఆచార్యులు కొలువుతీరుతున్నాడు… ఇది సహస్రాబ్ది శుభ సంకేతం. ఇలా అందిరీన అదీ ప్రజలను ఏకం చేస్తున్న ఏకైక ఉత్సవంగా ఇది నిలిచిపోతుందని ఆశిద్దాం.