Wednesday, 4 November 2026

తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు

హస్తినపై దృష్టి సారించిన గులాబీ దళపతి కెసిఆర్‌
వాతావరణం అనుకూలంగా మారడంతో ఢల్లీివైపు చూపు
హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో మార్పును సూచిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మోడీ అప్రజాస్వామిక నిర్ణాయలకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న సిఎం కెసిఆర్‌ సమయం కోసం చూస్తున్నారు. తాను ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని కెసిఆర్‌ చెప్పడం చూస్తే జాతీయ స్థాయిలో మరోసారి భూమిక
పోషించేందుకు సిద్ధమవుతున్నారని సూచిస్తోంది. కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు గాను రాజ్యసభ బరిలో నిలుస్తారని పరిశీలకులు అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కెటిఆర్‌,కవితలకు అప్పగించి కేవలం జాతీయ రాజకీయాలకు కేసిఆర్‌ పరిమితం అవుతారని భావిస్తున్నారు. ఇటీవల మోడీ వ్యాఖ్యలతో భగ్గుమన్న కెసిఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా మరోమారు మోడీ వ్యతిరేకతను కూడగట్టారు. దేశంలో కూడడా పరిస్థితులు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు వెళతారని.. అక్కడా విజయం సాధిస్తారని మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, జగగదీశ్వర్‌ రెడడ్‌ఇ లాంటి వారు ఘంటాపథంగా చెబుతున్నారు. కెసిఆర్‌ జూలు విదిలిస్తే సింహం లాగా దూసుకుని పోతారని అంటున్నారు. కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు వెళితే తప్పేంటని మరోమంత్రి ఎర్రబెల్లి అన్నారు. దేశంలో అభివృద్ధి, అవినీతి నిర్మూలన, యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించడం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం, సుపరిపాలన అందించడం తన వల్లే సాధ్యమవుతుందని కెసిఆర్‌ పదేపదే చెబుతున్నారు. కేసీఆర్‌ మాటలను కొంతమంది సీరియస్‌గా తీసుకోక పోవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక సైద్దాంతిక భూమికను ప్రస్తావిస్తున్నారని, ఆయన తెలంగాణలో అనుసరిస్తున్న ఫార్ములా దేశానికి అనుసరణీయం కాగలదని భావిస్తున్నారు. నదుల అనుసంధానం మొదలు, నీటి పంపకాలు, వ్యవసాయరంగ ముఖచిత్రం వంటి అంశాలను కెసిఆర్‌ బలంగా ప్రతిపాదించారు. ఇటీవల బడ్జెట్‌ సందర్బంగా మాట్లాడిన సందర్భంలోనూ అనేక అంశాలను మరోమారు ప్రస్తావిస్తూ గుణాత్మక రాజకీయాలను ప్రతిపాదించారు. అందుకే ఇటీవలి ఘఠనల తరవాత రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నదని ఆయన భావిస్తున్నారరు. రాజీనామా.. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ సృష్టించిన ట్రెండ్‌ ఇది.. బహుశా తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి తీసుకుని వెళ్లే క్రమంలో ఆయన వేసిన తొలి అడుగు ఇదే. ఆనాడు డిప్యూటి స్పీకర్‌గా ఉన్న కెసిఆర్‌ ఆ పదవికి, సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయి. ఆయన రాజీనామా తెలంగాణ ప్రజల్లో ఉత్తేజం నింపింది. జై కెసిఆర్‌ అన్న నినాదాలకు బీజం వేసింది. అలా మొదలైన ఆయన రాజీనామాల పరంపర ఉద్యమ ప్రస్థానంలో అనేకమార్లు కొనసాగింది. రాజీనామా చేసినప్పుడల్లా ఆయన ఇమేజ్‌ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. సరిగ్గా ఇప్పుడు అదే జరగనుందని భావిస్తున్నారు. సిఎంగా గజ్వెల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కెసిఆర్‌ మరోమారు రాజీనామా చేస్తారని అంటున్నారు. అలా రాజీనామా చేసి రాజ్యసభకు వెళితే ఇక్కడి నుంచి ఆయన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తారన్న ప్రచారం కూడా ఉంది. గజ్వెల్‌ అయితే సేఫ్‌ ప్లేస్‌గా భావిస్తున్నారు. కెటిఆర్‌,కవితలకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించి జాతీయ రాజకీయాలపై కెసిఆర్‌ దృష్టి పెడతారన్న ప్రచారం పార్టీలోనూ ఉంది. వివిధ రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ కన్నా బీజేపీని ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్‌, మహారాష్ట్రలలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఢీకొంటున్నాయి. పదవులను తృణప్రాయంగా వదిలేసి ప్రజల్లోకి వెళ్లడం…అన్న ట్రెండ్‌ కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కూడా అంతే సులువుగా సాగిపోయింది….ఇప్పుడదే సూత్రంతో కేంద్ర రాజకీయాల్లోకి కెసిఆర్‌ ప్రవేశిస్తే ప్రభంజనం సృష్టిస్తారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ ముందు మోడీ నిలవలేడని ఆయన బలంగా నమ్ముతారు. కెసిఆర్‌ తలచుకుంటే మోడీ ఉఫ్‌ అంటున్నారు. అధికారాన్ని వారసులకు అప్పగించి హస్తినలో చక్రం తిప్పేందుకు ఇప్పటికే వ్యూహం ఖరారు చేసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తంగా కెసిఆర్‌ జాతీయరాజకీయాలకు ఇదే సమయమని రాజకీయ విశ్లేషకులు
కూడా అంటున్నారు.