Wednesday, 4 November 2026

మాన్యువల్ లో పేరుకుపోయిన శిల్టును తొలగించాలి :కార్పొరేటర్ సుజాత నాయక్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )వనస్థలిపూర్ డివిజన్ నుండి డ్రైనేజీ నీరు హస్తినాపూర్ డివిజన్ ఏపీ ఎస్ సి బి కాలనీ నుండి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ తెలిపారు .సోమవారం హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్  అధికారులతో కలిసి సమస్య ఉత్పన్నమైనచోట పరిశీలించారు. తాత్కాలికంగా మాన్యువల్ లో పేరుకుపోయిన శిల్టును తొలగించి సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించారు. అనంతరం సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హస్తినాపురం ఏఈ  హేము నాయక్ జలమండలి మేనేజర్ రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.