Wednesday, 4 November 2026

పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోండి .. బి ఆర్ ఎస్ నాయకులు

 సికింద్రాబాద్ (జనం సాక్షి ):      కొంతమంది    సోషల్ మీడియా లో  దుష్ప్రచారం   చేస్తున్న     సికింద్రాబాద్   ఎమ్మెల్యే     పద్మారావు గౌడ్  పార్టీ మారుతున్నారన్న దుస్ప్రచారం    వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్   టిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు .   దీనికి సంబందించిన క్లారిటీ కూడా ఎమ్మెల్యే  పద్మారావు గౌడ్  ఇవ్వడం జరిగినది . దీనిపై   ఎమ్మెల్యే   ఆఫీస్ నుండి కూడా దీనిపై స్పందించి ఆఫీసియల్ గా స్టేట్ మెంట్  కూడా ఇచ్చారు .  సికింద్రాబాద్ నియోజకవర్గం సమన్వయ కర్తలుగా మాకు పద్మారావు  ఇచ్చిన సమాచారం మేరకు మీకు తెలియ చేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్  అడుగు జాడల్లో నడుస్తూ తెలంగాణ సాధించే వరకు అలుపెరుగనిపోరాటం చేసిన పద్మారావు  తెలంగాణ ప్రజల మనసు ఎరిగిన నాయకుడు సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రజల హృదయాలలో నిలిచి పోయిన నాయకుడు నేను ఎప్పుడు తెరాస ను వదిలి పోవడం జరగదని తేల్చి చెప్పరు.  సికింద్రాబాద్ నియోజకవర్గం లో పద్మరావు ని ఎదురించే దైర్యం లేక కొంతమంది  ఇలాంటి   దుష్ప్రచారం    చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు .   కావున దయచేసి ఈ విషప్రచారాన్ని తిప్పి కొట్టవలసినదిగా బి  ఆర్ ఎస్   నాయకులకు   సూచించారు.  ఇటువంటి ప్రచారం చేసిన వారిపై కఠిన తీసుకోవలసినదిగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాము అని .   సికింద్రాబాద్ నియోజకవర్గం  బి ఆర్ ఎస్   సమన్వయ కర్తలు, మాదిరెడ్డి, జలంధర్ రెడ్డి, రాజ్ సుందర్, గౌడు శీను, టీవీ శ్రీను  తెలిపారు.