“మారుతీ కారులో మంటలు”
డ్రైవర్ కు తప్పిన పెను ప్రమాదం
చేర్యాల సెప్టెంబర్ 23, (జనంసాక్షి) : కారులో మంటలు చెలరేగిన సంఘటన చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నడుస్తున్న మారుతి 800 కారు అగ్రి ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో డ్రైవర్ తప్ప ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారును రోడ్డుపై వదిలేసి బయటికి రావడంతో ప్రమాదం నుంచి డ్రైవర్ బయటపడ్డారు. బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే కారు అగ్ని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. అధికారులు దృష్టి సారించి కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై నడవకుండా తగు చర్యలు తీసుకుని అట్టి వాహనాలను సీజ్ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Attachments area