టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మహిళలకు గౌరవం

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం లోనే మహిళలకు ఎంతో గౌరవం దక్కుతుందని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు . శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టేకులపల్లి మండలం కు చెందిన మహిళలకు ఆమె చేతులు మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి సామరస్యానికి , పరమత సహనానికి మహిళలు అందరూ కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశ్యతోనే సీఎం కేసీఆర్, ఆడపడుచులకు చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందన్నారు.వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి తహసిల్దార్ కేవీ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ టేకులపల్లి మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు బర్మావత్ శివకృష్ణ, నాయకులు కాలే ప్రసాదరావు( పి ఆర్ కాలే) , మహిళలు తదితరులు పాల్గొన్నారు.