మాల మహానాడు అభ్యర్థిగా చింతపల్లి లింగమయ్య
నామినేషన్ దాఖలు
మునుగోడు అక్టోబర్ 14(జనంసాక్షి)
మాల మహానాడు తరపున స్వతంత్ర అభ్యర్థిగా చింతపల్లి లింగమయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ధర్మం ఆ ధర్మం కోసం జరుగుతున్న ఉప ఎన్నిక అన్నారు. ఎన్నికలో ప్రజలందరూ ధర్మం వైపు నిలబడాలని కోరారు. పాలక ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన మాలలను రాష్ట్ర ఆవిర్భావం అనంతరంగా మాలలను చిన్న చూపుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే స్వతంత్ర బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా మాల మహానాడు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా సంక్షేమ పాలన కోసం ప్రజలందరూ నడుం బిగించలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు,దళిత సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.