మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

హుస్నాబాద్ ఆగస్టు 28(జనంసాక్షి)హుస్నాబాద్ పట్టణ మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ,ఎల్లమ్మ,నల్ల పోచమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని ఎల్లమ్మ,పోచమ్మ ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని,తమతో తెచ్చిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యం గా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కౌన్సిలర్ బోజు రమ రవీందర్,అధ్యక్షులు జాల లక్ష్మయ్య,బురుగు సతీష్,జల ఆగయ్య,బూరుగు కృష్ణస్వామి, బురుగు యాదగిరి,సావుల వెంకటస్వామి,బోజు దేవయ్య,కెడం సంజీవ్,బోజు మహేందర్,జాల రవీందర్,జాల జ్యోతికుమార్,నాలువల ఆనంద్,దోమ ఆగయ్య మరియు మాల కులస్తులు పాల్గొన్నారు.