మిడ్ డే మీల్స్ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం
— గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హాతిరామ్ నాయక్
టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి): మండలంలోని జండాల తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యకర్త తేజావత్ రుక్కి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది . శుక్రవారం ఆమె దశదిన కర్మకు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి ఈ ఏ రాష్ట్ర సహాయ అధ్యక్షులు వాంకుడోదు హాథిరామ్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి పాఠశాలలో ఎంతోకాలంగా మధ్యాహ్న భోజన కార్యకర్తగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందటం విచారకరమన్నారు . కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు . ఈ కార్యక్రమంలో బీల్లుడుతండా సర్పంచ్ అజ్మీరా గలక నాయక్, పాఠశాల విద్యా కమిటీ చైర్మెన్ బి రవి నాయక్, బాలు ,సురేష్ ,సక్రాం తదితరులు పాల్గొన్నారు.