Tuesday, 3 November 2026

మిర్చిరైతులను ఆదుకోవాలి

ఒంగోలు,మార్చి8(జనం సాక్షి): మిర్చి రైతులను ఆదుకోవాలని, శనగలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కౌలురైతు సంఘం జిల్లా నాయకులు జె.జయంతిబాబు డిమాండ్‌ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో పాదయాత్ర చేపట్టి, సభ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారన్నారు. అయితే అధిక వర్షాలు, తామర తెగుళ్లతో 70 శాతం పంటను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను
ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. మిర్చి రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త తెగుళ్లతో శనగ పంట దిగుబడి గణనీయంగా తగ్గుతోందన్నారు. సభకు అధ్యక్షత వహించారు.