మిర్చి బజ్జీలు వేస్తూ నిరసన తెలిపిన వీఆర్ఏల…….
టేకుమట్ల.సెప్టెంబర్03(జనంసాక్షి)వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 41వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా వీఆర్ఏలు అందరూ మిర్చి బజ్జీలు వేస్తూ నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండలాధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి స్వామి, జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్,వీఆర్ఏలు అప్సర, రజిత,మౌనిక,కిరణ్ మై, సందీప్,రాజు,వీరస్వామి, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.