మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించాలి:-

మిర్యాలగూడ. జనం సాక్షి..
జిల్లా సాధన సమితి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ఈనెల 12,13 తేదీల్లో జరగనున్న రాష్ట్ర శాసన సభలో ప్రస్తావించి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు ఆదివారం శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావును క్యాంపు కార్యాలయంలో కలిసి కోరారు. జిల్లా ఏర్పాటు ప్రజల అందరి ఆకాంక్ష అని చట్టసభ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఏర్పాటు కోసం గత రెండు నెలల నుండి కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే స్పందించే అవకాశం ఉందని కోరారు. దీంతో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నత స్థాయికి జిల్లా ఏర్పాటు ప్రాధాన్యతను వివరిస్తూ సాధించుకునే ప్రయత్నం చేద్దామని సూచించారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లా మంత్రి ద్వారా ఇతర మంత్రి దృష్టికి తీసుకెళ్లి జిల్లా ఏర్పాటు కోసం కృషి చేద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్ బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ యాదవ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిమట ఎర్రయ్య, చేగొండి మురళి యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూం బాషా, బంటు వెంకటేశ్వర్లు,ఫారుక్, దుర్గయ్య, వెంకటయ్య, జయమ్మ కవిత తదితరులు పాల్గొన్నారు.