మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం తన వంతు సహకారం అందిస్తా:

ఎమ్మెల్సీ ఎల్ సి కోటిరెడ్డి
మిర్యాలగూడ. జనం సాక్షి.
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్థానిక సంస్థల శాసనమండలి ఉమ్మడి జిల్లా సభ్యులు ఎం సి కోటిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుకు అవసరమైన వనరులు, మౌలిక సౌకర్యాలు మిర్యాలగూడలో ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష అందరిలో ఉందని ఈ విషయమై జిల్లా మంత్రి, దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లాలని, ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రభుత్వం గ్రహించి జిల్లా ఇచ్చే అవకాశం ఉందన్నారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్నగర్ ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ వైపు దృష్టి మరల్చి జిల్లా సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు మాలోతు దశరధ నాయక్ డాక్టర్ రాజు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణారెడ్డి,ఎల్లయ్య,శ్రీనివాసరావు, పొట్లూరి పుల్లారెడ్డి బిసి సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిమట ఎర్రయ్య చేగుంట మురళి యాదవ్, సామాజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయరాజు, ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారుక్, బీఎంపీ నాయకులు మోషన్ అలీ, జ్వాల వెంకటేశ్వర్లు ఎస్ పి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు