మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమానికి సహకరించాలి:-

మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలికి సహకరించాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు మిర్యాలగూడ మండల పరిషత్ అధ్యక్షురాలు నూకల సరళ హనుమంత్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మిర్యాలగూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకటరమణ చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, లారీ అసోసియేషన్ అధ్యక్షులు చాంద్ పాషా టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్ లను కోరారు. శనివారం మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.దాంతోపాటు జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని సమితి నేతలు కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమానికి అన్ని వర్గాల మద్దతు ఉందని పార్టీలకతీతంగా ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి సభ్యులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, BSP నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వరావు ఎం ఐ ఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారుక్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్ల,యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, సామాజికవేత్త సరికొండ రిషికేశ్వర్ రాజు, రజక సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు దుర్గయ్య, సుధాకర్, నాగేష్ KP రాజు, తదితరులు పాల్గొన్నారు