మిషెల్‌ను కాల్చేస్తా
వాషింగ్టన్: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. రక్షణ దళంలోని ద్విచక్ర వాహన శ్రేణిలో పనిచేసి, ఇపుడు పరిపాన విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి మిషెల్‌ను తన వద్ద తుపాకీతో కాల్చేస్తాననీ తన సహచరులతో చెప్పినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒబామా భద్రత గురించి నిఘా అధికారులు మాట్లాడుకొంటున్న సమయంలో ఆ అధికారి ఈ మాటలన్నట్లు వాషింగ్‌టన్ పోస్టు పత్రిక పేర్కొంది. అయితే అలా బెదిరించిన అధికారి వివరాలు తెలియరాలేదు. అయితే దీనిపై తగిన సమాచారం తమ వద్ద ఉందని నిఘా అధికారులు తెలిపారు