మీ ఆడబిడ్డ గా ఒక అవకాశం ఇవ్వండి
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి
* మునుగోడులో ఇంటింటి ప్రచారం
మునుగోడు అక్టోబర్16(జనంసాక్షి):
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడిగా తన జీవితకాలం సేవలందించారని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు ఆదివారం ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని కమ్మగూడెం తో సహా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ ఇంటి ఆడబిడ్డ గా వచ్చిన ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ని మోసం చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.గోవర్ధన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప నేటికీ మునుగోడు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి కానుకగా మునుగోడులో నన్ను గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత మునుగోడు మండల ఎన్నికల ఇన్చార్జి పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు,రాయల నాగేశ్వరరావు,గండ్రత్ సుజాత మంచిర్యాల డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ సాగర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి నన్నూరి విష్ణువర్ధన్రెడ్డి,మేకల ప్రదీప్ రెడ్డి,మేకల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.